ETV Bharat / state

ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్

Congress Election Campaign Telangana 2023 : కర్ణాటక గెలుపుతో జోష్‌ మీదున్న కాంగ్రెస్‌.. రాష్ట్రంలోనూ తమ సత్తా చాటేలా కసరత్తులు ముమ్మరం చేసింది. ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచార హోరు పెంచింది. అసంతృప్తులను బుజ్జగిస్తూ అగ్రనేతల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. అభ్యర్థుల ఇంటింటి ప్రచారాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ బీఆర్ఎస్ వైఫల్యాలను బలంగా ఎత్తి చూపుతోంది.

Congress Election Campaign Telangana 2023
Congress Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 9:21 PM IST

ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్

Congress Election Campaign Telangana 2023 : ఆరు గ్యారంటీలే ప్రచారాస్త్రాలుగా మార్చుకున్న హస్తం పార్టీ(Telangana Congress) గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తుండటంతో ఇతర పార్టీల అసంతృప్తులు సైతం హస్తం గూటికి చేరుతున్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో అభ్యర్థి కోట నీలిమ ఎన్నిక ప్రచారం నిర్వహించారు. కౌరవులైన ఎమ్మెల్యే సుదీర్​రెడ్డి, అతని అనుచరులను ఓడించేందుకు పాండవులైనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా ఐక్యంగా కదులుతున్నారని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదుయాష్కీ గౌడ్ అన్నారు. తమ ఐక్యత చూసి సుదీర్​రెడ్డికి లాగులు తడుస్తున్నాయని ఆరోపించారు. చైతన్యపురిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్​రెడ్డి రాంరెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

Madhu Yaskhi in Congress Election Campaign : ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుదీర్​రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, గుండాలను వెంట పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను, కాలనీ అధ్యక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుదీర్​రెడ్డి కబ్జాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాంరెడ్డి ఎంతో పోరాటం చేశారన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఎల్బీనగర్ ప్రజలను కోరారు. ముషీరాబాద్‌లో ప్రచారం నిర్వహించిన అంజన్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటిలోనూ 30 శాతం కమీషన్లు దండుకున్నారని బీఆర్ఎస్​పై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

Congress Leaders Election Campaign in Telangana 2023 : మెదక్‌ జిల్లా రామాయంపేటలో ప్రచారం నిర్వహిస్తున్న మైనంపల్లి రోహిత్‌ను బీఆర్ఎస్ శ్రేణులు(BRS Party Leaders) అడ్డుకోవటంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్​కు మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆది శ్రీనివాస్‌ ఆరు సూత్రాల సంక్షేమ పథకాలను(Telangana Congress Six Guarantees) ప్రజలకు వివరించారు.

Telangana Congress Leaders Election Campaign : వరంగల్‌ జిల్లా పరకాల అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ఆరంభించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి ఓట్లు అభ్యర్థించిన సీనియర్‌ నేత జానారెడ్డి.. రాష్ట్రం కోసం బలిదానం చేసిన కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ప్రచారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

Congress Party speed up Election Campaign : ఆరు గ్యారెంటీలే ఆపన్న'హస్తం'గా.. కాాంగ్రెస్ ముమ్ముర ప్రచారాలు

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జోరు.. ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.