ETV Bharat / state

ప్రచారంలో కాంగ్రెస్ వెనుకంజ.. అభ్యర్థుల ఒంటరి పోరు

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఒంటరి పోరాటం చేస్తున్నారు.. ముఖ్యనేతలు బరిలో ఉండటంతో వారంతా నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఫలితంగా ఇతర పార్టీలతో పోలిస్తే ప్రచారంలో టీ కాంగ్రెస్ వెనుకబడింది. రాహుల్​ మలిదశ ప్రచార సభలు రద్దు కావడం హస్తం శ్రేణుల్ని నిరాశకు గురిచేసింది. 40మంది ప్రచార తారలు ఉన్నా ప్రచారంలో స్థానిక నేతలు తప్ప ఇంకెవరులేకుండా పోయారు.

కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 6:47 AM IST

Updated : Apr 7, 2019, 7:04 AM IST

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు ఎన్నికల బరిలో ఉండటం వల్ల వారంతా ఆయా నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. మూడు, నాలుగు లోక్​సభ నియోజక వర్గాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులు, స్థానిక నేతలే ప్రచారం చేస్తున్నారు. ఒక్కో లోక్​సభ స్థానం పరిధిలో పార్టీ తరఫున ఒక్క భారీ కార్యక్రమం కూడా నిర్వహించలేదనే అభిప్రాయాన్ని పలువురు పార్టీ ఎంపీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గానికే పరిమితం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి నల్గొండ నుంచి బరిలో నిలవడం వల్ల ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గానికే పరిమితం కావల్సి వచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ శాసన సభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం లోక్​సభ స్థానంపై దృష్టి పెట్టారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్​ పర్సన్​ విజయశాంతి మాత్రమే పలుచోట్ల ప్రచారంలో పాల్గొంటున్నారు.

రాహుల్​ మలిదశ ప్రచార సభలు రద్దు

రాహుల్​ మలిదశ ప్రచార సభలు రద్దు కావడం కాంగ్రెస్ శ్రేణుల్ని నిరాశకు గురిచేసింది. 40మంది ప్రచార తారలు ఉన్నా ప్రచారంలో స్థానిక నేతలు తప్ప ఇంకెవరూ లేకుండా పోయారు. శాసన సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారం ప్రణాళిక బద్దంగా సాగినా, లోక్​సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి పీసీసీ నుంచి షెడ్యూలు కూడా రూపొందించలేక పోయారు.

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థుల ఒంటరి పోరాటం

ఇవీ చూడండి: సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత

Intro:పెద్దపల్లి జిల్లా మంథని తెరాస పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు జడ్పీటీసీలు ఒక ఎంపీపీ పలు ఎంపిటిసిలు సర్పంచ్లు వార్డు మెంబర్లు ,ఈ మధ్యకాలంలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో ముత్తారం మండలం గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు తెరాస పార్టీ లో లో మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరినారు .

Body:ఎం శివ ప్రసాద్ మంథని

Conclusion:9440728281
Last Updated : Apr 7, 2019, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.