ETV Bharat / state

TS Farmers Problems : పల్లె ఖాళీ అయింది.. పంట చేనే ఇల్లయింది

Telangana Farmers Problems : పల్లె ఖాళీ అయింది.. పంట చేనే ఇల్లయింది. తడిసిన పంట వద్దే తెల్లవార్లూ రైతులు కాపలా కాస్తున్నారు. ఓ వైపు మక్కలకు మొలకలతో అన్నదాతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. మరోవైపు కరిమబ్బులు కర్షకుల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే వరిలో తేమ శాతం తగ్గడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లలో వేగం పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

author img

By

Published : May 6, 2023, 10:45 AM IST

farmers
farmers

Telangana Farmers Problems : రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో తడిసిన పంటలను కాపాడుకునేందుకు ఊరూవాడా వదిలి కుటుంబాలు పొలం గట్లపై పడిగాపులు కాస్తున్నారు. కాస్తోకూస్తో మిగిలే యాసంగి పంటను వడగండ్లు, ఈదురు గాలులు ఊడ్చుకుపోవడంతో రైతులకు ఈ ఆపతి తలెత్తింది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 16 నుంచి 29 వరకు కురిసిన భారీ వర్షాలు గ్రామీణ జీవన చిత్రాన్ని మార్చేశాయి. వానాకాలం తిండి గింజలకు.. యాసంగి ఖర్చులు వెళ్లదీసుకోవడానికి పిల్లాపాపలతో కలిసి కర్షకులు కల్లాల వద్ద శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వరంగల్‌ జిల్లా మొదలు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వరకు ఎక్కడ చూసినా రైతు కుటుంబాలు పంట కుప్పల వద్దే దర్శనమిస్తున్నారు. మొక్కజొన్న, వరి, బొబ్బెర్లు 60 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే మెదక్‌, కామారెడ్డి, జిల్లాల్లో కురిసిన భారీ వానలకు పొలాల్లో నీరు చేరి దిగబడుతున్నాయి. వరి నేలకొరిగింది. చేతితో కోసేందుకు అందడం లేదు.

వరికోత యంత్రాలూ దిగబడుతున్నాయి. కొన్నిచోట్ల గంటకు రూ.3,200 చెల్లించి చైన్‌ కోత మిషిన్లు పెడుతున్నా.. అవికూడా మట్టిలో కూరుకుపోతున్నాయి. మరోవైపు కరిమబ్బులు చూస్తూ అన్నదాతలు దిగాలు పడుతున్నారు. మిగిలిన పంటైనా వస్తుందా రాదా అనే ఆందోళనతో కనిపిస్తున్నారు. వీలైనంత త్వరగా వరికోత మిషన్​లు ఏర్పాటు చేసి కోతలు పూర్తి చేయించాలని రైతులు వేడుకుంటున్నారు.

తడిచిన పంటను ఆరబెడుతున్న సాత్విక
తడిచిన పంటను ఆరబెడుతున్న సాత్విక

తేమ శాతం తగ్గడం లేదు: మరోవైపు చాలా చోట్ల పంటలో 14 శాతంలోపు తేమ ఉంటేనే.. ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు రోజు విడిచి రోజు వర్షం కురుస్తుండటంతో తేమ 16, 18 శాతం కంటే దిగిరావడం లేదు. దీంతో పంటను రోడ్ల అంచున, పరుపురాళ్లపై ఆరబోస్తున్నారు. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో రోడ్ల వెంట ఎక్కడ చూసినా ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. మొక్కజొన్న పొత్తులు తీసిన చోట తెల్లబూజు వస్తోంది. కానీ అలాగే పొట్టుతో ఉంచితే తేమశాతం పెరిగి మొలకలు వస్తున్నాయని అన్నదాతలు చెబుతున్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లలో వేగం పెంచితే తప్ప.. చేతికి వచ్చిన ఈ కాస్త పంటకైనా డబ్బులు వస్తాయని అంటున్నారు. లేదంటే బతుకు కష్టమవుతుందని రైతులు పేర్కొంటున్నారు.

చేతికి వచ్చిన మక్క కంకులపై మొలకలొస్తున్నాయని చూపుతున్న గజ్జెల లక్ష్మి

వరి సాగుచేస్తే నష్టమని మక్కలు వేసినా: యాసంగిలో వడగళ్లు పడతాయని.. వరి వేస్తే నష్టమని, మక్కలు వేశామని కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన మహిళా రైతు గజ్జెల లక్ష్మి తెలిపారు. గత ఇరవై రోజులుగా వర్షం పడుతూనే ఉందని పేర్కొన్నారు. చేతికి వచ్చిన మక్క కంకులపై మొలకలొస్తున్నాయని వాపోయారు. రైతులకు ప్రకృతి కూడా సాయం చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఎకరాల్లో రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే రూ.50 వేలు కూడా వచ్చేలా లేవంటూ ఆమె దిగాలు చెందుతున్నారు.

పండిన పంటను ఇలా అటూ ఇటూ తిప్పేస్తున్న రైతు సాంబయ్య

25 బస్తాలకు పడిపోయింది: వరిలో తేమ 18 శాతానికి పైగా ఉంటోంది. ఓ వైపు 14 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబున్నారంటూ.. పండిన పంటను ఇలా అటూ ఇటూ తిప్పేస్తున్న రైతు సాంబయ్య పేర్కొన్నారు. ఆయనిది వరంగల్‌ జిల్లా రేగొండ. 6 ఎకరాల్లో సాగుచేసిన వరి కోతకొచ్చే దశలో కురిసిన వడగండ్ల వర్షం పంటనంతా పాడు చేసిందంటూ సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఎకరాల్లో సాగు చేశానని.. ఎకరాకు 70 బస్తాలపైన దిగుబడి రావాల్సిందని వివరించారు. కానీ ఇప్పుడు 25 బస్తాలకు పడిపోయిందని సాంబయ్య వాపోయారు.

మొలకెత్తిన వడ్లను చూపుతున్న సాత్విక
మొలకెత్తిన వడ్లను చూపుతున్న సాత్విక

జల్దీ కొనేలా చూడండి సారూ: ఓ వైపు తన భర్త హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో ఉన్నారని.. మరోవైపు ఇక్కడేమో పంట తడిసిపోతోందని సాత్విక వాపోయారు. ఈమెది మెదక్ జిల్లా చేగుంట. కొన్ని బస్తాలను గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించామని వివరించారు. జల్దీ వాటిని కొనేలా చూడండి సార్‌’’ అంటూ మొలకెత్తిన వడ్లను చూపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 30న తన భర్త కిశోర్‌ స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టిందని చెప్పారు. దీంతో ఆయన ఆసుపత్రికే పరిమితమయ్యారని అన్నారు. మూడెకరాల్లో సాగుచేసిన పంట అకాల వర్షాలతో నానిపోతోందని వివరించారు. వేరే దారిలేక పుట్టింటోళ్లను తీసుకొచ్చి పంటను ఆరబెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: Crop Damage : వానలు ఆగవాయే.. కౌలు రైతుకు దిగులు తప్పదాయే

థియేటర్​లో మహిళపై 'ఎలుక' ఎటాక్​ కేసు.. ఐదేళ్ల తర్వాత కోర్టు తీర్పు!.. ఏం చెప్పిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.