హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యులు నిరసనకు దిగారు. కేంద్రం ప్రతిపాదించిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50 శాతం సీట్ల ఫీజుల నిర్ణయం ఆయా కళాశాలలకు వదిలేయడం సరికాదని అన్నారు. ఎన్ఎంసీ బిల్లుతో విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుందని.. ఇప్పటికే వైద్య విద్య అత్యంత ఖరీదైనదిగా మారిందన్నారు. బిల్లులో పేర్కొన్న నెక్ట్స్ ఎగ్జామ్ ప్రతిపాదన సరిగా లేదని... నెక్ట్స్ ఎగ్జామ్ విధానాన్ని బిల్లు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. క్రాస్ పద్ధతిలో నర్సింగ్ వంటి కోర్సులు చదివినవారికి కూడా బ్రిడ్జ్ కోర్సులు అందించి అల్లోపతి వైద్యం ప్రాక్టిస్ చేయడానికి అనుమతించటం వైద్య ప్రమాణాలను తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి:బలపరీక్షకు స్పీకర్ డెడ్లైన్- నేడు ఓటింగ్!