నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానాల్లో అరుదైన, కీలకమైన శస్త్రచికిత్సలు (Complicated Surgeries in Govt Hospitals ) చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రులకు అధునాతన వైద్య పరికరాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఓ స్వచ్ఛంద సంస్థ ఆధునిక 2డీ ఈకే యంత్రాన్ని సమకూర్చింది. ఎంఎన్‌జేలో బోన్‌మ్యారో మార్పిడి యంత్రాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇలాంటి ఆధునిక పరికరాలతో అధునాతన చికిత్సల (Complicated Surgeries in Govt Hospitals ) ను అందిస్తున్నారు. ఉస్మానియాలో ఇప్పటివరకు ఉచితంగా 700 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. ప్రైవేటులో రూ. 7-10 లక్షల వరకు ఖర్చయ్యే కిడ్నీ మార్పిడులను నిమ్స్‌లో లక్షన్నరలోనే.. ఉస్మానియా, గాంధీలో ఉచితంగానూ చేస్తున్నారు. లక్షల్లో ఖర్చయ్యే బోన్‌మ్యారో మార్పిడి చికిత్సల (Complicated Surgeries in Govt Hospitals ) ను నాంపల్లి ఎంఎన్‌జే ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో అయిదుగురు పేద రోగులకు ఈ చికిత్సలు చేశారు. నిత్యం గాంధీలో అన్ని రకాల శస్త్రచికిత్సలు కలిపి 60-70 వరకు, ఉస్మానియాలో 70-80, నిమ్స్‌లో 100 సర్జరీలు చేస్తున్నారు. వీటిలో 20-30 శాతం వరకు సంక్లిష్టమైనవి ఉంటున్నాయి.
- నల్గొండ జిల్లాకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని(18)కి ఇటీవలే ఉస్మానియా వైద్యులు అరుదైన సర్జరీ చేశారు. ఆమె కుడివైపు రొమ్ములో ఇబ్బంది ఏర్పడింది. తల్లిదండ్రులు ఉస్మానియాలో సంప్రదించారు. వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసి సరిచేయవచ్చునని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 5 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసి అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇచ్చారు వైద్యులు.
- గగన్‌పహాడ్‌కు చెందిన ఓ యువతి(17) మానసిక సమస్యతో బాధపడుతోంది. ఇంతలో కడుపులో నొప్పి మొదలైంది. తండ్రి ఉస్మానియా వైద్యులను సంప్రదించాడు. ఆమె పొట్టలో తలవెంట్రుకలు ముద్దలుగా ఉన్నట్లు గుర్తించారు. మానసిక సమస్య వల్ల ఆమె వాటిని తింటున్నట్లు గుర్తించి, సర్జరీ చేసి పొట్ట నుంచి 2 కిలోల వెంట్రుకల ముద్దను తీసి ప్రాణాలు కాపాడారు.
- కరోనా రెండోదశలో అనేకమంది బ్లాక్‌ఫంగస్ బారిన పడ్డారు. చాలామందికి శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. ప్రైవేటులో ఒక్కో శస్త్ర చికిత్సతో పాటు మందులకు రూ. లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఈ సమయంలో గాంధీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి ఆసుపత్రులు ఆదుకున్నాయి. 2-3 వేల మందికి ఈ మూడు ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు. ఖరీదైన మందులను కూడా 3 నెలల పాటు ఉచితంగానే అందించారు.
పేదలు వినియోగించుకోవాలి
చిన్నచిన్న లోపాలు కొన్ని ఉన్నా.. సరైన సమాచారం ఇవ్వరనే ఆరోపణలున్నా.. పారిశుద్ధ్య పరిస్థితి కొంత బాగోలేకున్నా గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెరిగాయి. క్లిష్టతరమైన చికిత్సలు (Complicated Surgeries in Govt Hospitals ) కూడా అందిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్, పేట్లబుర్జు ఆసుపత్రులు ముందువరసలో నిలుస్తున్నాయి. రద్దీ కారణంగా సేవల్లో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ.. చక్కటి చికిత్స అందుతోంది. లక్షలు అప్పు చేసి ప్రైవేటులో చేరటం కంటే ప్రభుత్వ ఆసుపత్రు (Complicated Surgeries in Govt Hospitals) ల్లో ఉచిత సేవలను వినియోగించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ వైద్య వర్సిటీకి రూ.350 కోట్లు కేటాయించిన ‘గ్లోబల్’ రవీంద్రనాథ్