Summer Jobs: ఉద్యోగ జీవితం ప్రారంభం కావడానికి ముందు అంటే హైస్కూల్ వయసు దాటాక ఎంతో కొంత పని అనుభవం ఉన్న విద్యార్థులు వృత్తి జీవితంలో మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నారని కొన్ని సర్వేల ప్రకారం తేలింది. పని అనుభవం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగలమనే నమ్మకాన్ని నింపుతుందట. అది మనల్ని చాలా విషయాల్లో ముందుకు నడిపిస్తుందని ఆ సర్వేలో వెల్లడైంది. ఉద్యోగం చేయాలంటే ముఖ్యమైన సమస్య కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం. అందుకే ముందుగా ఉద్యోగ అనుభవం అనేది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నిలబడేందుకు ప్రయత్నించేలా చేస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడం నుంచి, తప్పుల నుంచి ఎన్నో పాఠాలు సైతం నేర్పించగలదు.
టైమ్ మేనేజ్మెంట్: ప్రతి ఒక్కరి జీవితంలో సమయం చాలా విలువైనది. గడిచిన కాలం వెనక్కి రాదు. ముఖ్యంగా యువతి, యువకులకు యుక్త వయస్సులో సెటిల్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. మరి కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవాలంటే మనకంటూ కొన్ని లక్ష్యాలుండాలి. లక్ష్యాలున్నప్పుడే సమయ వినియోగం అనేది ఆచరణలోకి వస్తుంది. అందుకే సమ్మర్ జాబ్‌లో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకునే వీలుంటుంది. నేర్చుకున్న స్కిల్స్ ఉద్యోగ జీవితంలోనే కాదు.. ఉన్నత చదువుల్లోనూ ఎంతో ఉపయోగపడుతుంది.
మనకేది సూటబుల్: హైస్కూల్ చదువు పూర్తయ్యాక ఎలాంటి కోర్సులో చేరాలనే డౌట్ ఉంటుంది. చదువు పూర్తయ్యాక కేరీర్ ఆప్షన్‌గా ఏది ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దనుకుంటే.. ఈ సమ్మర్ జాబ్ కొంత మేరకు ఉపయోగపడుతుంది. కొందరికి వినియోగదారులకు సేవలు అందించడం నచ్చుతుంది... మరికొందరికి వారిని డీల్ చేయడం అంటేనే భయం. కొందరికి ఒకే చోట కూర్చొని పని చేసే జాబ్ నచ్చవచ్చు.. కానీ ఇంకొందరికి ట్రావెల్ చేస్తూ చేసే జాబ్లంటే ఇష్టం ఉండొచ్చు. ఇలా మనకు ఏది నచ్చుతుందో.. మనకు ఏది సూటబుల్ అనేది తెలుసుకోవడానికి ఈ సమ్మర్ జాబ్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి.
కొత్త పరిచయాలు.. సరికొత్త అవకాశాలు: విద్యార్థులుగా ఉన్నప్పుడు మన వయస్సు గలవారితోనే సత్సంబంధాలు ఉంటాయి. కానీ ఉద్యోగ జీవితంలో అలా ఉండదు. మనకంటే పెద్దవారు, చిన్నవారు, విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులతో కలిసి మనం చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల పరిస్థితులు, ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మనం పరిచయాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మన ఆలోచనా ధోరణిని విస్తృతం చేయడమే కాకుండా.. కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంటాయి.
ఇతరుల కంటే మనం బెటర్: సమ్మర్ జాబ్స్ అనేవి తక్కువ కాలమే చేస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో వృత్తి అనుభవం రాదు. కానీ మనకు ఎంతో కొంత ఉద్యోగ అవగాహన అనేది వస్తుంది. అలాగే మనం ఉద్యోగం కోసం పెట్టే రెజ్యూమెలో ఇతరుల కంటే మనం బెటర్ అని చూపించగలదు. సమ్మర్ జాబ్స్ అనేవి ఉద్యోగం పట్ల, పని చేయడం పట్ల మనకున్న ఆసక్తిని, శ్రద్ధను తెలియజేస్తాయి. ఇలా చేస్తే మన చదువు పూర్తయ్యేలోపు మంచి పని అనుభవం ఉంటే.. జీవితంలో బాగా రాణించగలం.
మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి: వీటితో పాటు షార్ట్ టైమ్ సమ్మర్ జాబ్స్ చేయడం వల్ల పని, వ్యక్తిగత జీవితాన్ని మేనేజ్ చేసుకోవడం, మనీ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్.. ఇలా ఎన్నో ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇది అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు కూడా ఈ పద్ధతి నచ్చితే వెంటనే సమ్మర్లో టైమ్ వేస్ట్ చేయకుండా ఉద్యోగం కోసం ప్రయత్నించండి మరి.
ఇవీ చదవండి: