ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో డ్రైవర్ రాజు ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికుల మనసులో విషం నింపారని ఆరోపించారు. తమ డిమాండ్ల కోసమే ఉద్యమాలు చేశాం తప్పితే ...విలీనం కోసం కాదని తెలిపారు. విలీనం మాటతో తమని తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోరాటం అనేది ఉద్యోగం చేసుకుంటూ... చేయాలన్నారు. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని... మరికొంత మంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పిలుపుతో విధుల్లో చేరి న్యాయ పోరాటం చేద్దామని రాజు సూచించారు. డ్రైవర్ రాజు ఫిర్యాదుతో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
ఈ కథనం చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!