ETV Bharat / state

'మోదీ ఆటలు ఇకపై కొనసాగవు.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాం' - TRS Formation Day News

Cm Kcr Speech In TRS Plenary: దేశాభివృద్ధికి కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాల్లో గతి, స్థితిని మార్చే ప్రత్యామ్నాయ అజెండా కావాలని పేర్కొన్నారు. స్థిరచిత్తంతో పనిచేస్తే దేశం.. అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. మత విద్వేషాలు మంచిది కాదన్న కేసీఆర్... దేశానికి అభ్యుదయ పథం కావాలని అప్పుడే భారత్ బాగుపడుతుందని పేర్కొన్నారు.

cm kcr
cm kcr
author img

By

Published : Apr 27, 2022, 9:50 PM IST

Updated : Apr 28, 2022, 6:40 AM IST

'మోదీ ఆటలు ఇకపై కొనసాగవు.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాం'

Cm Kcr Speech In TRS Plenary: ‘‘మనం బాగుపడితే సరిపోదు.. రాష్ట్రం మరింత ఉజ్వలంగా ముందుకు వెళ్లాలంటే దేశ రాజకీయాలు కూడా గొప్పగా ఉండాలి’’ అని ఇవాళ్టి ప్లీనరీలో ఎంతో మంది అభిప్రాయపడ్డారని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకు అనుగుణంగా తప్పకుండా రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో తెరాస పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలు, వ్యవస్థలు, దేశ సమగ్ర స్వరూపం, వనరులు, మౌలిక సదుపాయాలు.. ఇలా అనేక అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు దేశవిదేశాల నుంచి ఎంతో మంది ఆర్థికవేత్తలు, నిపుణులు, మేధావులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్‌ అయిన అఖిల భారత సర్వీసుల అధికారులు దేశవ్యాప్తంగా 2వేలకుపైగా ఉన్నారని.. త్వరలోనే వారందరితో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఏ కార్యం చేపట్టినా ఒక సమగ్రమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవతరించాలని ఆకాంక్షించారు. వ్యక్తులు ప్రధానమంత్రులు కావడం ముఖ్యం కాదని.. ఫలితాలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మూసధోరణి రాజకీయ విధానాలు మారాలన్నారు. ఇప్పుడు దేశ ప్రజలకు కావాల్సింది ఫ్రంట్‌లు.. టెంట్‌లు కాదన్నారు. ఒక కొత్త పంథాలో ప్రయాణిచేందుకు ఏ రకమైన పద్ధతులు ఎంచుకోవాలి.. వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ వెల్లడించారు.

యువకులను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించడమే భాజపా వ్యూహం. మోదీ ఆటలు ఇకపై కొనసాగవని హెచ్చరిస్తున్నా. ఒక్కసారి విధ్వంసం చెలరేగితే దీర్ఘకాలం నష్టపోవల్సి వస్తుంది. రాష్ట్రంలో ఘర్షణలు జరిగితే పెట్టుబడులు, కంపెనీలు రావు. మతం గురించి తప్ప.. అభివృద్ధి, సంక్షేమం గురించి భాజపా ఎప్పుడైనా మాట్లాడిందా?

-- కేసీఆర్‌, సీఎం

తెరాసకు రూ.వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి: ‘‘దేశంలో సరిపడ సాగు నీరు ఉన్నప్పటికీ రైతులకు అందవు. దేశంలో విద్యుత్‌ ఉంది.. కానీ ప్రజలకు అందదు. దేశంలో ఉన్న వనరులు వాడుకునే చిత్తశుద్ధి లేదు. దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలి. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాం. ప్రకృతి వనరులు, మానవ వనరులు దేశంలో పుష్కలంగా ఉన్నాయి. స్థిరచిత్తంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరిస్తుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే అనేక రకాల వనరులు, డబ్బు కావాలని.. వాటిని ఎలా సమకూర్చుకుంటారని కొంత మంది మిత్రులు నన్ను అడిగారు. తెరాసకు నిబద్ధత కలిగిన 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తెరాసకు రూ.865 కోట్ల నిధులు ఉన్నాయి. రూ.వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి. రూ.కోటి విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు. రూ.లక్ష, రూ.వెయ్యి విరాళాలు ఇచ్చే సభ్యులూ ఉన్నారు.

తెరాసకు నిబద్ధత కల్గిన 60లక్షల మంది సభ్యులు ఉన్నారు. తెరాసకు రూ.865కోట్లు నిధులు ఉన్నాయి. రూ.వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి. రూ.కోటి విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు. రూ.లక్ష, రూ.వెయ్యి చొప్పున విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు. ఒక్కో సభ్యుడు సగటున రూ.వెయ్యి విరాళం ఇచ్చినా రూ.600కోట్లు సమకూరుతాయి. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో తెరాస గెలుస్తుంది. 90పై చిలుకు స్థానాల్లో తెరాస గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగేలా ఎమ్మెల్యేలు చూడాలి.

--కేసీఆర్‌, సీఎం

ప్రసంగాల జోరు.. అబద్ధాల జోరు: దేశంలో ఏ పరిస్థితి చూసినా బాగాలేదు. దేశానికి ప్రత్యామ్నాయ ప్రజల అజెండా కావాలి. రాష్ట్రాల సీఎంలతో ఇవాళ ప్రధాని మాట్లాడారు. కరోనా మళ్లీ వస్తుందనే పేరుతో నిర్వహించిన నాటకమే ఈ సమావేశం. కరోనా పేరుతో సమావేశమని చెప్పి రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని అంటారా? కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, యువతకు ఉద్యోగాల గురించి భాజపా ఆలోచించిందా?విద్వేషాలు, ఉద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశానికి ఏం చేశారు? జీడీపీ, ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. ద్రవ్యోల్బణం మాత్రం బాగా పెరిగింది. ప్రసంగాల జోరు.. అబద్ధాల హోరు తప్ప మోదీ పాలనలో ఏమీ లేదు. యువకులను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించడమే భాజపా వ్యూహం. ఒకసారి విధ్వంసం చెలరేగితే దీర్ఘకాలం నష్టపోవాల్సి వస్తుంది. దేశంలో ఘర్షణలు జరిగితే పెట్టుబడులు, కంపెనీలు రావు. మోదీ ఆటలు ఇకపై సాగవు’’ అని కేసీఆర్‌ హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలతో మాట్లాడాం. దేశంలో విద్యుత్‌ ఉంది...ప్రజలకు అందదు. దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలి. దేశంలో ఉన్న వనరులు వాడుకునే చిత్తశుద్ధి లేదు.జాతీయ రాజకీయలపై దృష్టిసారించాం. ప్రకృతి వనరులు, మానవ వనరులు దేశంలో ఉన్నాయి. స్థిరచిత్తంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థికశక్తిగా భారత్‌ అవతరిస్తుంది. జాతీయ రాజకీయాలకు వెళ్లాలంటే ఆర్థిక వనరులు కావాలని దాని ఒకరు అడిగారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు వెళ్తున్నామని పిలుపునిస్తే ఆర్థిక వనరులు సమకూరుతాయి.

-- కేసీఆర్, సీఎం

ఇవీ చదవండి :

Last Updated : Apr 28, 2022, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.