అందరికీ అధికార భోగం దక్కాలని పీవీ నరసింహారావు అభిలాషించారని సీఎం కేసీఆర్ అన్నారు. పీవీ 360 డిగ్రీల వ్యక్తిత్వంపై పెద్ద పుస్తకమే రాయవచ్చని తెలిపారు. వ్యక్తిత్వ పటిమ తెలుసుకునేందుకు పీవీ జీవితం గైడ్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆర్థిక సంస్కరణలు తెచ్చి నవభారత నిర్మాతల్లో ఒకరిగా నిలిచారని కేసీఆర్ ప్రశంసించారు. నెహ్రూకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని సీఎం చెప్పారు. పీవీ శత జయంతి ఉత్సవాలు 51 దేశాల్లో జరుగుతున్నాయని వివరించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇదీ చూడండి : పీవీ జయంత్యుత్సవాల్లో ఆకట్టుకున్న స్పెషల్ మాస్కులు