ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ.. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR Review on TSPSC Paper leakage Issue: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

cm kcr
cm kcr
author img

By

Published : Mar 18, 2023, 11:58 AM IST

Updated : Mar 18, 2023, 12:49 PM IST

CM KCR Review on TSPSC Paper leakage Issue: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుడంతో భవిష్యత్‌ కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, టీఎస్​పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కమిషన్‌ సభ్యులు, పలువురు అధికారులు హాజరయ్యారు.

పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్​పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ రూం నుంచి నిందితులు పరీక్షా పేపర్లను కాఫీ చేసుకొని బయటకు తీసుకురావడంతో గ్రుప్‌-1 సహా మొత్తం నాలుగు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో ఉన్నతాధికారుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రద్దు అయిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే అనే అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం : రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటేకే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పరీక్షలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని.. ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాకుండా నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి నిర్వహించే పరీక్షల విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంతో పాటు అభ్యర్థులకు భరోసా ఇచ్చేలా, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు : మరోవైపు ఇదే వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను బీజేపీ రాష్ట్ర నేతల బృందం కలిసింది. డీకే అరుణ, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, మర్రిశశిధర్‌రెడ్డి, రాంచందర్, విఠల్ గవర్నర్‌ను కలిసిన బృందంలో ఉన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌ ఇప్పటికే నివేదిక కోరారు. సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలని తమిళిసైని కోరినట్లు సమాచారం. పేపర్‌ లికేజీ వల్ల ఇప్పటికే నాలుగు పోటీ పరీక్షల్ని రద్దు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 18, 2023, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.