ETV Bharat / state

ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం

author img

By

Published : Oct 17, 2019, 5:07 AM IST

Updated : Oct 17, 2019, 11:58 AM IST

అందర్నీ ఇబ్బందులకు గురిచేస్తూ... చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న కార్మిక సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. చర్చలకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ఓ వైపు సమ్మె, మరోవైపు సంస్థ నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీకి కొత్త ఎండీని నియమించడం సాధ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానం ముందు బలంగా వినిపించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం

సమ్మె ద్వారా ఆర్టీసీకి కార్మిక సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సంస్థ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇది పూడ్చలేని లోటు అని అభిప్రాయపడ్డారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచింతగా సమ్మెకు వెళ్లాయని.. ఎట్టి పరిస్థితుల్లో వారితో చర్చలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదని ప్రకటించారు.

ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం

కొత్త ఎండీ సాధ్యం కాదు...

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎండీ నియామకం సాధ్యంకాదనే విషయాన్ని న్యాయస్థానానికి వివరించాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు సర్కారు 44 శాతం ఫిట్​మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 300 కోట్ల మేర ఆర్టీసీకి సాయం అందించినట్లు వెల్లడించారు.

అనుభవం ఉన్నవారినే తీసుకోండి...

తర్వలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడక్కడ అద్దె బస్సులతో ప్రమాదాలు జరుగుతున్నాయని... అలాంటి పరిస్థితి లేకుండా చూడాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. అనుభవం ఉన్న వారిని మాత్రమే డ్రైవర్‌గా ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

TG_HYD_08_17_Cm_Review_On_Rtc_Pkg_3182301_3053262 Reporter: Kartheek, Raghu () అందరికి ఇబ్బందులకు గురిచేస్తు...చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్న కార్మిక సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్పు లేదని చర్చలకు ఆస్కారమే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఓ వైపు సమ్మె మరో వైపు సంస్థ నష్టాల్లో ఉన్న సందర్బంలో ఆర్టీసీకి కొత్త ఎండీని నియమించడం సాధ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానం ముందు బలంగా వినిపించాలని కేసీఆర్ సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మరింత పకదబ్బంది గా చేసి సమ్మె వళ్ల ఎవరు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వాయిస్ ఓవర్ః సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సంస్థకు రూ. 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇది పూడ్చలేని లోటు అని అన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచింతగా సమ్మెకు వెళ్లాయని....ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదన్నారు. వెంటనే ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియమకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె అసంబద్దమని న్యాయస్థానంలో బలమైన వాదన వినిపించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎండీ నియామకం సాధ్యంకాదని న్యాయస్థానానికి వివరించాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో సేవలందించాలని....మొత్తం అన్ని బస్సులు నడపాలని, పకడ్బందిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి 5 గంటల పై వరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వాయిస్ ఓవర్ః రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిందని..... ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రబుత్వం 3300 కోట్ల మేరకు ఆర్టీసీకి సాయం అందించినట్లు సీఎం చెప్పారు. వేతనాలు భారీగా పెంచినా సంస్థ లాభాల్లోకి రాలేదన్నారు. బతుకమ్మ, దసర పండగల సమయంలో సంస్త, ప్రజల గురించి పట్టించుకోకుండా సంఘాలు వ్యవహరించాయన్నారు. పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాధరణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ బస్సుల కోసం వేచి చూసే పరిస్థతి రాకుడదన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులకు, ఇతర వర్గాలకు ఇచ్చిన బస్ పాస్ లు అనుమతించాలన్నారు. ఆర్టీసీ అద్దె బస్సులు మరిన్ని తీసుకోవాలని..... అన్ని రూట్లలో వాటిని నడపాలని సీఎం చెప్పారు. అక్కడక్కడ అద్దె బస్సులతో ప్రమాదాలు జరుగుతున్నాయని..... అలాంటి పరిస్థితి లేకుండా చూడాలన్నారు. అనుభవం ఉన్న వారిని డ్రైవర్ గా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఇక కొత్త ఎండీ ఇప్పుడు అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ఎండ్....
Last Updated : Oct 17, 2019, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.