ETV Bharat / state

కేసీఆర్ కీలక నిర్ణయం... జలవనరుల శాఖకు కొత్త స్వరూపం

నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
author img

By

Published : Dec 28, 2020, 2:34 PM IST

Updated : Dec 28, 2020, 9:31 PM IST

14:33 December 28

నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

సాగునీటి రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... శాఖకు కొత్త స్వరూపాన్ని ఖరారు చేశారు. ఇక నుంచి భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నీ ఒకే గొడుగు కింద పనిచేయన్నాయి. ఒక ప్రాంతంలోని అన్ని రకాల జలవనరులశాఖ వ్యవహారాలన్నీ ఒకే అధికారి పర్యవేక్షించేలా ప్రక్రియను పూర్తి చేశారు.

ప్రాదేశిక ప్రాంతాలుగా...  

రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్‌ను పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో ఇక నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలు ఉంటాయి. ఆరుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్‌లను నియమించి వారికి  బాధ్యతలు పంచాలని నిర్ణయించారు.

ప్రత్యేక ఈఎన్సీలు...

 సాధారణ, పరిపాలన, నిర్వహణ విభాగాలకు సైతం  ఇక నుంచి ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక ప్రాంతాలకు ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ హోదాలో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు  ఉండగా... అదనంగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు చేరింది. చీఫ్ ఇంజినీర్ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్​ఈ పోస్టులను 47 నుంచి 57కు, ఈఈ పోస్టులను 206 నుంచి 234కు, డీఈఈ పోస్టులను 678 నుంచి 892కు, ఏఈఈ పోస్టులను 2వేల436 నుంచి 2,796కు పెంచారు.  

పూర్తి చేయండి...

టెక్నికల్ ఆఫీసర్లు, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, రికార్డు అసిస్టెంట్ల సంఖ్య సైతం పెరిగింది. జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. అత్యంత ప్రాధాన్యతాంశంగా రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టామన్న సీఎం కేసీఆర్... ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగా మిగిలిన కొద్దిపాటి లింకులను  త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యేలతో...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి... జిల్లా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఛనాక-కొరాట ప్రాజెక్టు ఆనకట్ట, పంప్ హౌస్, కాల్వలను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. చెన్నూరు ఎత్తిపోతలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో పర్యటన...

జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేసేందుకు ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్పి ప్రాజెక్టుతోపాటు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకాలకు వెంటనే టెండర్లు పిలిచి, పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.  

సర్వే చేపట్టండి...

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న సీఎం... ఇందుకోసం వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  

ఎత్తిపోతల పథకం మంజూరు...

హుజూర్ నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని... ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  

ఇదీ చూడండి: సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక : మంత్రి కేటీఆర్

Last Updated : Dec 28, 2020, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.