రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులతో సీఎం ప్రగతిభవన్‌లో సమావేశమై బడ్జెట్‌పై చర్చించారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులు హాజరయ్యారు.
బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన సంబంధిత అంశాలపై కేసీఆర్ సమీక్షించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఈ నెల 14వ తేదీన ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది రోజుల పాటు సమావేశాలు జరగవచ్చని సమాచారం.
ఇదీ చదవండి: తమ మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: కేటీఆర్