వానాకాలం పంట సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్ రావు, తదితరులతో ప్రగతిభవన్లో సీఎం సమావేశమయ్యారు. వానాకాలంలో పంటల సాగు, సంబంధిత అంశాలపై భేటీలో చర్చిస్తారు. విత్తనాలు, ఎరువుల లభ్యత, సన్నద్దతను సమీక్షిస్తారు.
కల్తీ, నకిలీ విత్తనాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చిస్తారు. వానాకాలం రైతుబంధు సాయం అందించే విషయమై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్న తరుణంలో అన్ని అంశాలపై ఇవాళ చర్చించి రేపటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: KTR : పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు రెండు కొత్త ర్యాంపులు ప్రారంభం