ETV Bharat / state

దిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు..

CM KCR Delhi Tour updates: తెలంగాణ రాష్ట్ర సమితి... భారత్‌ రాష్ట్ర సమితిగా అవతరించిన అనంతరం వడివడిగా... దిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాట్లు సాగుతున్నాయి. హస్తినలోనే ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... రేపు భారాస కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా... భావసారూప్యత కలిగిన పార్టీల నేతలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో హాజరుకున్నారు.

CM KCR
CM KCR
author img

By

Published : Dec 13, 2022, 12:43 PM IST

CM KCR Delhi Tour updates: దిల్లీలోని బీఆర్​ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు రుత్వికులు యాగాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా ఈ ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి హస్తిన చేరిన బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమాలలో పాల్గోనున్నారు.

గణపతి పూజతో... రుత్వికులు యాగం మొదలు పెట్టారు. 12 మంది రుత్వికుల ఆధ్వర్యంలో పూజ, యాగాలు, పుణ్యావాచనం, యాగశాల సంస్కారం... యాగశాల ప్రవేశం, చండి పారాయణం, మూల మంత్ర జపాలు నిర్వహిస్తున్నారు. రేపు నవ చండి హోమం, రాజశ్యామల హోమం.. ఇతర పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టనున్నారు. శృంగేరి పీఠం గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో... యాగాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ విజయవంతం కావడం, దేశం సుభిక్షంగా ఉండటానికి దైవకృప కోసం యాగాలను... నిర్వహిస్తున్నారు.

భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటు పనుల్లో తాను నిమగ్నం కావడంపై... మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు ఉదయం హైదరాబాద్‌ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా... భావసారూప్య పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరవుతారని.. ఆయన పేర్కొన్నారు. బుధవారం పలువురు జాతీయ నేతలతో సీఎం సమావేశం కానున్నారు.

బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు: మరోవైపు బీఆర్​ఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను న్యూదిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తొలగించారు. రేపు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం దృష్ట్యా హోర్డింగులను ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. అయితే దిల్లీ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గం, వీఐపీలు తిరిగే ప్రాంతం కావడంతో వాటిని తొలగించామని ఎన్‌డీఎంసీ అధికారులు తెలిపారు.

దిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గ్‌లోని అద్దె భవనంలో బీఆర్ఎస్ తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం 12.36 గంటలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్‌, రైతు నాయకుడు రాకేష్‌ టికాయిత్‌ సహా పలు రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.