రెవెన్యూ చట్టం బిల్లుపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. సంబంధిత అంశాలపై చర్చించారు.
ప్రజలకు సులువుగా జవాబుదారీతనంతో సేవలు అందేలా పొందిపరచాల్సిన అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యేకించి భూ పరిపాలన విషయంలో అనుసరించాల్సిన విధానంపై లోతుగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేసినట్లు తెలిసింది. వాటి ఆధారంగా అధికారులు తదుపరి కసరత్తు చేయనున్నారు.
ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి