జపాన్ దేశం టోక్యోలో ప్రారంభమవుతున్న 32వ ఒలింపిక్ క్రీడల్లో(TOKYO OLYMPICS 2020) పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్(KTR) శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్... విశ్వానికి శాంతి, సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సీఎం అభివర్ణించారు.
ఒలింపిక్స్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం కలగాలని కేసీఆర్ కోరుకున్నారు. భారతదేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోమారు ఎగరవేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
భారత అథ్లెట్లకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అథ్లెట్లు తమ కఠోర శ్రమ, పట్టుదలతో రాణించి ఈ విశ్వక్రీడల్లో భారత కీర్తి, ప్రతిష్ఠలు నలుదిశలా చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈసారి మరిన్ని పతకాలతో స్వదేశానికి తిరిగి రావాలని కోరారు.
ఇవీ చదవండి: ఒలింపిక్స్ ప్రారంభోత్సవం.. గతమెంతో ఘనం!
BE ALERT: వర్షాలు పడుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసా!