ETV Bharat / state

CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం

కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పీవీ మార్గ్​లోని జ్ఞానభూమిలో నిర్వహించిన పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాల్లో(PV Narasimha Rao Centenary Celebrations) ఆయన పాల్గొన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు.

cm kcr
ముఖ్యమంత్రి కేసీఆర్​
author img

By

Published : Jun 28, 2021, 1:13 PM IST

Updated : Jun 28, 2021, 3:14 PM IST

పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కొనియాడారు. ఆయనను ఎంత గౌరవించుకున్నా తక్కువేనన్నారు. ఏడాది కాలంగా పీవీ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నామని... వాటిని విజయవంతంగా నిర్వహించిన కేశవరావుకు అభినందనలు తెలిపారు.

''పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం. నవోదయ విద్యాలయాలు, గురుకులాలు పీవీ తీసుకొచ్చినవే. నవోదయ, గురుకులాల ఫలాలను సమాజం అందుకుంటోంది. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి. ఆయన నిరంతర సంస్కరణవాది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల నిష్ణాతుడు ఆయన. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా భూసంస్కరణలు తెచ్చారు. ప్రజల కోసం స్వయంగా తన 800 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చారు. అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి... మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పూర్తిగా నడిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు అనేకసార్లు పీవీ సేవలు స్మరించుకున్నారు. మన్మోహన్‌సింగ్ స్వయంగా నాతో పీవీ గొప్పతనం గురించి ప్రస్తావించారు.''

-సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్​

కాకతీయ వర్సిటీ(Kakatiya University)లో పీవీ పీఠం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలకు పీవీ పేరు పెడతామని పేర్కొన్నారు. పీవీ కుటుంబాన్ని గౌరవించుకునేందుకు వాణీదేవికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చామన్నారు. వాణీదేవిని గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్వగ్రామం, జిల్లాల్లో, దిల్లీలో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు.

ఇదీ చూడండి: నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

Last Updated : Jun 28, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.