ETV Bharat / state

మద్యం నియంత్రణలో ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం

మద్య నిషేదానికి చర్యలు తీసుకుంటున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వైన్ షాపులపై నియంత్రణలు విధించిన వైకాపా సర్కార్​ తాజాగా బార్లపై దృష్టి పెట్టింది.

new liquor policy in andhra pradesh
author img

By

Published : Nov 7, 2019, 10:21 PM IST

మద్య నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్య తగ్గించాలని జగన్ ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం ఆదేశించారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకే బార్లలో మద్యం అమ్మకాలు జరపాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.

ఇవీ చదవండి:మరో అడుగు... ప్లాస్టిక్​ నిషేధంపై అధ్యయనానికి కమిటీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.