ETV Bharat / state

Bhatti fired on KCR: కేసీఆర్​ పథకం ప్రకారమే దిల్లీకి మంత్రుల బృందం: భట్టి

author img

By

Published : Dec 22, 2021, 10:03 AM IST

Bhatti fired on KCR: ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో రైతులను ఇబ్బందులు పెడుతున్న తెరాస సర్కారుపై చావు డప్పు మోగిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్​ పథకం ప్రకారమే పార్లమెంటు సమావేశాలు లేని రోజుల్లోనే మంత్రుల బృందాన్ని దిల్లీకి పంపిందని ధ్వజమెత్తారు.

clp leader bhatti vikramarka
భట్టి విక్రమార్క

Bhatti fired on KCR: చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటించి మూడు నెలలుగా రైతులను అవస్థలు పెడుతున్న తెరాస ప్రభుత్వానికి చావు డప్పు మోగిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అన్నదాతల ఆత్మహత్యలకు​ తెరాస కారణమవుతోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తెలంగాణలో రణం చేస్తున్నట్టు రైతులను మభ్యపెట్టడుతున్నారని భట్టి విమర్శించారు. వచ్చే యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని తెరాస ఆధ్వర్యంలో కేసీఆర్ దిల్లీలో ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు.

మభ్య పెడుతున్నారు

కేంద్ర మంత్రులు అందుబాటులో ఉండరని తెలిసి, పార్లమెంటు సమావేశాలు లేని శని, ఆదివారాల్లో మంత్రులు, ఎంపీల బృందం ఎవరిని కలుద్దామని దిల్లీకి వెళ్లారని భట్టి ప్రశ్నించారు. రైతుల సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే తెరాస బృందం ముందుగానే కేంద్ర మంత్రుల అపాయింట్​మెంట్​ తీసుకునేవారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తెరాస మాత్రమే కొట్లాడుతోందని.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం కోసమే సీఎం కేసీఆర్ పథకం ప్రకారం దిల్లీకి తాను వెళ్లకుండా మంత్రుల బృందాన్ని పంపించి రాజకీయం చేస్తున్నారని ధ్వజ మెత్తారు.

ఇదీ చదవండి: CAG Report: మిషన్​కాకతీయతో తెలంగాణలో పెరిగిన భూగర్భ జలమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.