ETV Bharat / state

'పోలీస్​ స్టేషన్లు... తెరాస పార్టీ కార్యాలయాలు కాదు'

సీఎం క్యాంపు కార్యాలయంను ముట్టడించిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్‌లో పెట్టడానికి వాళ్లు ఏమైనా టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. గోషామహల్‌ పోలీస్​స్టేషన్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పరామర్శించేందుకు సీఎల్పీ నేత భట్టితోపాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఇతర నాయకులు వెళ్లారు. వారిని అనుమతించకపోవడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు.

clp leader bhatti comment Police stations are not trs offices
'పోలీస్​ స్టేషన్లు... తెరాస పార్టీ కార్యాలయాలు కాదు'
author img

By

Published : Aug 12, 2020, 7:09 PM IST

Updated : Aug 12, 2020, 7:20 PM IST

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని సీఎల్పీ నేత విక్రమార్క ఖండించారు. ఎమ్మెల్యేలకే పోలీస్​స్టేషన్‌కు అనుమతి లేదనడం ఏంటని ప్రశ్నించిన ఆయన.. అవి ఏమైనా తెరాస పార్టీ కార్యాలయాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఎమ్మెల్యేలకు ఎందుకు అనుమతి ఉండదని నిలదీశారు. విద్యార్థుల సమస్యలపై ఈనెల 18న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భట్టి వెల్లడించారు. కరోనాతో పిల్లల చదువు ఎలా అని విద్యార్థుల తల్లదండ్రులు అవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు.

సమగ్రమైన విద్యావిధానాన్ని ప్రకటించాలని ఎన్‌ఎస్‌యూఐ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పాఠాలు చెబుతుండగా..ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఏంటో స్పష్టత లేదన్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు సిలబస్ నష్టపోకుండా విద్యార్థుల పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 62 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు.

'పోలీస్​ స్టేషన్లు తెరాస ఆఫీసు కార్యాలయాలు కాదు'

ఇదీ చూడండి : 'విద్యార్థుల గురించి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోరు'

Last Updated : Aug 12, 2020, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.