ETV Bharat / state

Clay Ganesh Idols Hyderabad : మట్టి గణపతియే ప్రకృతి హితం.. అదే పండగ పరమార్థం - గణేశ్ చతుర్థి 2023 తెలంగాణ

Clay Ganesh Idols Hyderabad 2023 : గణపతి నవరాత్రి ఉత్సవాలు దగ్గరపడుతున్న వేళ.. నగరంలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎవరికి వారు తమ స్థాయికి తగినట్లు విగ్రహాలు కొనుక్కెళ్తున్నారు. కాలనీల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, కార్యాలయాల్లో విరివిగా వీటిని ఏర్పాటు చేస్తుండడంతో సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో చేసిన విగ్రహాల ద్వారా జల కాలుష్యం పెరుగుతుందని, మట్టివే వినియోగించాలని పర్యావరణ వేత్తలు అవగాహన కల్పించడంతో మట్టి వినాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు తమ వంతుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించేలా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తూ.. ఉచితంగా మట్టి వినాయకులను కూడా పంపిణీ చేస్తున్నారు. నగరంలోనే ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడిని కూడా ఈసారి పర్యావరణ హితంగా మట్టితో రూపొందించడం విశేషం.

Clay Ganesh Idols Hyderabad
Clay Ganesh Idols
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 5:39 PM IST

Clay Ganesh Idols Hyderabad 2023 : వినాయక చవితి(Ganesh Chaturthi 2023) వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగరంలో వాడవాడలా గణేశ్ ప్రతిమలు ఏర్పాటు చేసి, నవరాత్రి ఉత్సవాలు ముగిశాక చెరువుల్లో నిమజ్జనం(Vinayaka Idols Immersion) చేయడం ఆనవాయితీ. జనాభా పెరుగుతుండటంతో అందుకు తగినట్లు విగ్రహాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల(POP Ganesh Idols) వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుందని వాటిని హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం చేయవద్దని 2021లో హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హెచ్​ఎండీఏ(HMDA), జీహెచ్​ఎంసీ(GHMC)తో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(Telangana Pollution Control Board) వారు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

63 Feet Ganesh in Khairatabad 2023 : ఈసారి జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో 2 లక్షలు, కాలుష్య నియంత్రణ మండలి తరఫున మరో 70 వేల మట్టి విగ్రహాలు తయారు చేయించి వాడవాడలా పంచుతున్నారు. 2-3 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. గణేశ్ ఉత్సవాలు అనగానే నగర వాసులకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు(Khairatabad Ganesh). ఈసారి వాళ్లు కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని తయారు చేయించారు. 4 గంటల పాటు నీరు పడినా విగ్రహం దెబ్బతినకుండా దీన్ని రూపొందించారు. నిమజ్జనం చేసిన తర్వాత 8 గంటల్లో పూర్తిగా కరిగిపోతుందని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ హితం కోరి తాము ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామన్నారు.

Ganesh Chaturthi 2023 : గణేశ్‌ ఉత్సవాలకు ముస్తాబవుతోన్న తెలంగాణ.. ఈసారి మట్టి గణపయ్యను పూజిద్దామా..

Clay Ganesh Idols 2023 : వాస్తవానికి ప్రకృతితో మానవుడు మమేకం అనే కోణంలో వివిధ రకాల ప్రతిమలు, కాయలు, పూలు, పండ్లతో గణేశుని పూజిస్తారు. ఒకప్పుడు ప్రజలు ఎవరికి వారే స్థానికంగా లభించే మట్టితో విగ్రహాలు తయారు చేసుకుని పూజించేవారు. కానీ ఒకరితో ఒకరికి పోటీ పెరిగి వేరే వాళ్ల కంటే తమ విగ్రహం పెద్దగా ఉండాలంటూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(POP Idols) వైపు మొగ్గు చూపారు. గత కొన్నేళ్లుగా పలు స్వచ్ఛంద సంస్థలు కాలనీల్లో సమావేశాలు పెట్టి పీవోపీ వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్యంపై దాని ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించాయి. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశాయి. ఫలితంగా పీవోపీ స్థానంలో మట్టితే చేసినవి నెలకొల్పేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. ఆర్డర్లు కూడా బాగా పెరిగాయని విక్రయదారులు అంటున్నారు. ఇప్పుడు పీవోపీతో చేసిన ప్రతిమలు అమ్మేచోట తప్పనిసరిగా మట్టితో చేసినవాటిని కూడా విక్రయిస్తున్నారు.

నగరంలో మట్టి గణేశ్​ల పంపిణీ : హెచ్‌ఎండీఏ సంస్థ ఎకోఫ్రెండ్లీ అయిన సీడ్ వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సీడ్ వినాయకులు ఏంటంటే నవరాత్రి పూజల అనంతరం వినాయకుడి తొట్టిల్లోనే పెట్టి నీరు పోస్తే ప్రతిమ మట్టిగా మారి దాంట్లో మొక్క మొలకెత్తుతుంది. ఇలాంటి విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కలను కూడా ప్రతి ఇంట్లో పెంచుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్(Press Club in Hyderabad)​లో కూడా సీడ్ గణేశ్‌లను పంపిణీ చేస్తున్నారు. వినాయక చవితికి ఇంకా ఒక్కరోజే ఉండటంతో ప్రతిమల కొనుగోలు కోసం వచ్చిన వారితో సందడి నెలకొంది. భిన్న రూపాలతో భక్తుల పూజలందుకునేందుకు లంబోదరులు సిద్ధమవుతున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య గణనాథులను కాలనీలకు తీసుకెళ్తున్నారు.

Clay Ganesh Idols Telangana : ప్రకృతిని ప్రేమిద్దాం.. మట్టి గణపయ్యను పూజిద్దాం

Ganesh Chaturthi 2023 Telangana : జై బోలో మట్టి గణపతికీ.. మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.