ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రోడ్లపై కంప వేయడం వివాదాలకు దారితీస్తోంది. లాక్డౌన్ పరిస్థితుల్లో ఎవరూ వారి గ్రామాల్లోకి రాకూడదని హెచ్చరికలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులో కంప వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు గ్రామాల్లోకి పోలేని పరిస్థితి ఉంది.
విడవలూరు మండలంలో లక్ష్మీపురం, కొత్తూరు గ్రామాల మధ్య కంప వేసుకున్నారు. కొందరు తీయాలని కోరడం... మరికొందరు కుదరని చెప్పడంతో వివాదం పెరిగి.. రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు చెదరగొట్టారు. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ... నెల్లూరు: ముందు పాజిటివ్.. తర్వాత నెగెటివ్