హైదరాబాద్ నగర శివారుల్లోని సివిల్ సప్లై గోదాములను రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ కె. తిరుమల్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మైలర్దేవపల్లి, బండ్లగూడా జాగీర్‌లో గల ఎమ్ఎల్పీ పాయింట్ సర్కిళ్లలోని గోదాములను తనిఖీ చేశారు.
ముఖ్యంగా సన్నబియ్యం, ప్రజాపంపిణీ బియ్యానికి సంబంధించిన సేకరణ, నిల్వలు, జారీకి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ జిల్లా సీఆర్ఓ బి. బాలమాయాదేవి, ఐఏఎస్, డీసీ ఎస్వోపీ పద్మ, జిల్లా మేనేజర్ సీహెచ్ తనుజ పాల్గొన్నారు.