ETV Bharat / state

సోమాజిగూడలో విద్యుత్​ ఉద్యోగ సంఘాల నేతల ధర్నా

author img

By

Published : May 22, 2020, 2:27 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ 2020 బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ, తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా సోమాజిగూడలోని విద్యుత్‌ సౌధ ఎదుట విద్యుత్​ ఉద్యోగ సంఘాల నేతలు ధర్నా చేశారు.

electricity employees union protest in hyderabad
విద్యుత్​సౌద వద్ద విద్యుత్​ ఉద్యోగ సంఘాల ధర్నా

హైదరాబాద్‌ సోమాజిగూడలోని విద్యుత్​ సౌధ వద్ద సీఐటీయూ, తెలంగాణ స్టేట్​ యునైటెడ్​ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్​ యూనియన్ నేతలు​ ధర్నా చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్​ సవరణ 2020 బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ చట్టం అమలులోకి వస్తే విద్యుత్‌ ఉద్యోగులకు భద్రత ఉండదని... రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత విద్యుత్‌తో పాటు... రాయితీల భారం మరింతగా పడుతుందని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌, ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రావు ఆరోపించారు.

ఇదీ చూడండి: యాదాద్రి ఆలయం మూసి.. రెండు నెలలు పూర్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.