ETV Bharat / state

CID Notice: అమరావతి రైతుకు సీఐడీ నోటీసులు

అమరావతి రైతుకు సీఐడీ నోటీసులిచ్చింది. తన భూమిని ఎవరూ బలవంతంగా లాక్కోలేదని.. ఏపీ రాజధాని నిర్మాణం కోసం తానే స్వయంగా అమ్ముకున్నానని ఆయన వెల్లడించిన అనంతరం ఈ పరిణామం జరిగింది. సీఆర్‌పీసీలోని 160 సెక్షన్‌ ప్రకారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నోటీసు జారీ చేశారు.

CID Notice
సీఐడీ నోటీసులు
author img

By

Published : Jul 6, 2021, 12:13 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాజధాని ప్రాంతంలోని తన అసైన్డ్‌ భూమిని ఎవరూ బలవంతంగా తీసుకోలేదని... తానే స్వచ్ఛందంగా అమ్ముకున్నానని వెల్లడించిన ఉద్ధండరాయునిపాలేనికి చెందిన ఎస్సీ రైతు పూల రవికి సీఐడీ అధికారులు సోమవారం నోటీసులిచ్చారు. సీఆర్‌పీసీలోని 160 సెక్షన్‌ ప్రకారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నోటీసు జారీ చేశారు.

పిలిచినప్పుడు రావాలి

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి రావాలంటూ మధ్యాహ్నం 12 గంటలకు నోటీసు ఇచ్చారు. తాను ఓ వేడుకలో ఉన్నానని.. వెంటనే అంటే విచారణకు రాలేనని రవి చెప్పారు. దాంతో తాము పిలిచినప్పుడు హాజరుకావాలని సీఐడీ సిబ్బంది ఆయనకు సూచించారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఏ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసు ఇచ్చారు.

నోటీసుల్లో ఏముందంటే..

‘‘ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌విత్‌ 34, 35, 36, 37 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌)(జీ), ఏపీ అసైన్డ్‌ భూములు బదలాయింపు నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం సీఐడీ క్రైమ్‌ నెంబర్‌ 05/2021ను గతంలో నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం సాగుతోంది. దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు మీకు తెలిసి ఉంటాయని భావిస్తున్నాం. అసైన్డ్‌ భూముల బదలాయింపునకు సంబంధించిన కొన్ని పత్రాలపై మీరు సాక్షిగా కూడా సంతకాలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ ఎదుట హాజరుకాగలరని’’ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఏపీలోని అమరావతిలో అసైన్డ్‌ భూముల కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. మార్చి నెల 15, 25వ తేదీల్లో రైతులను పోలీస్ స్టేషన్​లకు పిలిచి విచారించిన సీఐడీ అధికారులు.. అనంతరం నేరుగా రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి వివరాలు సేకరించారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో ఎస్సీ రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్​లో సీఐడీ విచారణకు పలువురు ఎస్సీ రైతులు హాజరయ్యారు. ఏయే ప్రాంతాల్లో భూమలు ఉన్నాయి.. ఎవరెవరికి విక్రయించారన్న దానిపై ఆరా తీశారు. మధ్యవర్తుల ద్వారా భూములు అమ్మారా లేక.. ఎవరైనా బలవంతంగా లాక్కున్నారా అని ప్రశ్నించారు. తమ భూములను రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామని రైతులు సీబీఐ అధికారులకు వివరించారు. తమ వద్ద భూములను ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కూడా అందిందని రైతులు తెలిపారు. అనంతరం మందడం డీఎస్పీ కార్యాలయంలో పలు దస్త్రాలు పరిశీలించారు.

ఇదీ చదవండి: Amaravathi jac letter: రఘురామ సహా ఎంపీలందరికీ అమరావతి జేఏసీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.