హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలిలోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. దుకాణం వెనుక ఉన్న షటర్ తొలిగించి రూ. 10 పది లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారని బేకరీ యాజమాన్యం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్డౌన్ కారణంగా కౌంటర్లోని నగదును అలాగే ఉంచినట్లు వారు పోలీసులకు తెలిపారు. బేకరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి... దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా జమానా.. వేస్తారు జరిమానా!