ఏపీ, తమిళనాడు సరిహద్దులో నిర్మించిన గోడను... చిత్తూరు జిల్లా అధికారులు కూల్చివేయించారు. పలమనేరు నుంచి రాకపోకలను నియంత్రించేలా... తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం సమీపంలోని సైనిగుంట వద్ద... పొరుగు రాష్ట్రం అడ్డుగోడ నిర్మించింది. ఈ విషయంపై స్పందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా.... రైతుల సమస్యలపై తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. సానుకూల స్పందన రావడంతో... గోడ తొలగించి రైతుల రాకపోకలు పునరుద్ధరించాలని.... స్థానిక అధికారులను ఆదేశించారు. గుడియాత్తం తహసీల్దార్ తమ సిబ్బందితో కలిసి... గోడను కూల్చివేయించారు.
తమిళ సరి... హద్దు గోడలు కూలాయి మరి!
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా చొరవతో అంతర్రాష్ట్ర సరిహద్దులో నిర్మించిన గోడను జిల్లా అధికారులు కూల్చివేయించారు.