తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రెండో రోజు ఉదయం శ్రీవారు చిన్న శేషవాహనంలో విహరించారు. వాహన సేవను.. తితిదే అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఢ వీధుల్లో స్వామివారి వైభవాన్ని స్వయంగా దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు గంటల పాటు కొనసాగిన వేడుకలో ప్రత్యక్ష భాగస్వాములైన భక్తులు.. తన్మయత్వం పొందారు. ఉత్సవాల్లో భాగంగా.. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి హంసవాహన సేవ జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన తితిదే.. భక్తులకు సత్వరమే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసింది.
చిన్న శేషవాహనంపై స్వామివారి విహారం.. భక్తుల తన్మయత్వం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో.. చిన్న శేష వాహన సేవ వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రెండో రోజు ఉదయం శ్రీవారు చిన్న శేషవాహనంలో విహరించారు. వాహన సేవను.. తితిదే అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఢ వీధుల్లో స్వామివారి వైభవాన్ని స్వయంగా దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు గంటల పాటు కొనసాగిన వేడుకలో ప్రత్యక్ష భాగస్వాములైన భక్తులు.. తన్మయత్వం పొందారు. ఉత్సవాల్లో భాగంగా.. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి హంసవాహన సేవ జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన తితిదే.. భక్తులకు సత్వరమే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసింది.
చిన్న శేషవాహనంలో స్వామివారి విహారం.. భక్తుల తన్మయత్వం
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రెండో రోజు ఉదయం శ్రీవారు చిన్న శేషవాహనంలో విహరించారు. వాహన సేవను.. తితిదే అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమాఢ వీధుల్లో స్వామివారి వైభవాన్ని స్వయంగా దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు గంటల పాటు కొనసాగిన వేడుకలో ప్రత్యక్ష భాగస్వాములైన భక్తులు.. తన్మయత్వం పొందారు. ఉత్సవాల్లో భాగంగా.. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి హంసవాహన సేవ జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన తితిదే.. భక్తులకు సత్వరమే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసింది.
Conclusion: