Children Day celebrations in Telangana: బాలల దినోత్సవాన్నిపురస్కరించుకొని హైదరాబాద్ కవాడిగూడలో మాధవ ఆటిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ ఛైర్మన్ జగన్మోహన్ రావు హాజరయ్యారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నెహ్రూ చిత్రపటానికి గీతారెడ్డి నివాళులర్పించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో బాలల దినోత్సవాన్ని పలు రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహించాయి.
పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి శ్రీధర్‌బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్‌లో శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు పాలనాధికారి రిజ్వాన్.. జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. నిర్మల్‌లోని వాసవి పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఇవీ చదవండి: రేపు ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేసీఆర్ శ్రీకారం