రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశమయ్యారు. ప్రస్తుతం కొవిడ్ వైరస్ వ్యాప్తి, తీవ్రత, పాజిటివ్ రోగులకు చికిత్సపై అధికారులతో సమీక్షిస్తున్నారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ సహా ఇతరత్రాల లభ్యతపై చర్చిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న రోగులకు బ్లాక్ ఫంగస్ వస్తున్న నేపథ్యంలో ఆ విషయమై కూడా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స, ఔషధాలపై సమీక్షించనున్నారు. ఇక టీకాల అంశంపై కూడా చర్చకు రానుంది. అందుబాటులో ఉన్న టీకాలు, కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న టీకాలతో పాటు అవసరమైన వాటి సమీకరణ, ప్రక్రియపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరపనున్నారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు