CM CUP in Telangana : రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్నడు లేని విధంగా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చీఫ్ మినిస్టర్ కప్-2023 పేరుతో.. పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం స్పోర్ట్స్ ఆథారిటీ సంస్థ ఆధ్వర్యంలో . నేటి నుంచి ప్రారంభం కానున్న.. ఈ పోటీలు ఈ నెల 28వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగానే 18 క్రీడాంశాలలో సీఎం కప్ పోటీల నిర్వహించనుంది.
CM CUP in Telangana 2023 : ఇందులో 15 క్రీడలు ఒలంపిక్ అసోసియేషన్ గుర్తింపు పొందిన క్రీడలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 15 నుంచి 17 వరకు మండల స్థాయిలో.. 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో.. 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్నారు. వీటిలో విజయం సాధించిన విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.50,000 శాట్స్ ప్రోత్సాహకాలను అందిచనుంది. ఈనెల29న సీఎం కప్ ఉత్సవాలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనుంది.
Chief Minister's CUP in Telangana : ఈ పోటీల్లో దాదాపు 4 లక్షలకు పైగా విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. వీరిలో దాదాపు 10,000 మంది క్రీడాకారులను గుర్తించనున్నారు . మండల స్థాయి పోటీలకు సంబంధించిన కమిటీలతో.. జిల్లా స్థాయి కమిటీ వారు సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు సన్నద్ధమవుతారు. ఈ మేరకు క్రీడా మైదానాలను సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు వేశారు. తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు సీఎం కప్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ పోటీలకు సంబంధించిన లోగో, బ్రోచర్, మస్కట్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్పోర్ట్స్ ఆథారిటీ ఛైర్మన్ అంజనేయ గౌడ్, ఆ సంస్థ ఎండీ లక్ష్మి, పలువురు అర్జున అవార్డు గ్రహితలు పాల్గొన్నారు. క్రీడలు యువతను మంచి మార్గంలో నడిపించేందుకు దోహదం చేస్తాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఆయన ఆలోచనలకు అనుగుణంగా వీటిని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోటీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
ఇవీ చదవండి : Hanuman Jayanti 2023 : కొండగట్టులో వైభవంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు