గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు, రైల్వే రక్షక దళం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక భద్రతని ఏర్పాటు చేశారు. అన్ని ప్లాట్ ఫామ్‌లతో పాటు వెయిటింగ్ హాల్, పార్కింగ్ పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు.
రైల్వేస్టేషన్లో ప్రయాణికుల బ్యాగులను, వారి వస్తువులను డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశీలించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఈ తనిఖీలు చేపట్టినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆర్పీఎఫ్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నెంబర్ 182కు సమాచారం అందించాలని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నయ్య తెలిపారు.
ఇదీ చూడండి: 18 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్