ETV Bharat / state

డ్రోన్లు ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం... డీజీపీకి ఫోన్ - cbn

విజయవాడ కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసంపై ఇద్దరు వ్యక్తులు ఇవాళ డ్రోన్ ప్రయోగించారు. వారిని తెదేపా నేతలు పట్టుకున్నారు. అనంతరం పోలీసులు డ్రోన్ ప్రయోగించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

డ్రోన్లు ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం... డీజీపీకి ఫోన్
author img

By

Published : Aug 16, 2019, 12:49 PM IST

కరకట్ట వద్ద తాను నివసించే ఇంటిపై డ్రోన్లు ఎగరటంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ, డీజీపీతో ఆయన ఫోన్​లో మాట్లాడారు. హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎగరేయటమేంటని వారిని తెదేపా అధినేత నిలదీశారు. డ్రోన్లు ఎగరేస్తున్న వ్యక్తులెవరు?.. అనుమతులు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. "డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల్లేకుండా డ్రోన్లు ఎగరేయడానికి వీల్లేదు. అన్ని అనుమతులతోనే డ్రోన్లు ఎగరేస్తున్నారా?.. నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు?. చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడింది ఎవరో తెలియజేయాలని స్పష్టం చేశారు. నిఘా వేసిందెవరో, దాని వెనుక కుట్ర ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

సంబంధిత కథనం

డ్రోన్ కలకలం: చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_16_TDP_Press meet_AVB_AP10004Body:ప్రజలకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తే చేతులు కట్టుకుని కూర్చోమని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కదిరినియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. చౌక ధరల దుకాణం డీలర్లు ఎలాంటి తప్పు చేయకున్నా తొలగించడాన్ని ఆయన తప్పు పట్టారు. నిబంధనల మేరకు అవకతవకలకు పాల్పడిన చౌక ధరలడిపోల డీలర్లకు నోటీసు లు ఇవ్వాలన్నారు. నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరించడం అధికారపార్టీకి అలవాటుగా మారు తోందని ఆయన విమర్శించారు. వైకాపా నాయకుల నిర్వాకం వల్ల గాండ్లపెంట లోని ప్రభుత్వ పాఠశాల 1000 మంది విద్యార్థులకు రక్షిత నీరు అందకుండా పోయిందన్నారు. అధికార అ పార్టీ ఆగడాలను చూస్తూ ఉపేక్షించబోమని న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.