ETV Bharat / state

కొవాగ్జిన్‌ మనకు గర్వకారణం: చంద్రబాబు

author img

By

Published : Jan 5, 2021, 5:58 PM IST

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్‌ సంస్థ తీసుకొస్తున్న కొవాగ్జిన్​ మనకు గర్వకారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

babu
కొవాగ్జిన్‌ మనకు గర్వకారణం: చంద్రబాబు

స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను.. కేంద్రం అనుమతించడంపై తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌.. మనకు గర్వకారణం అన్నారు. ఆంధ్రప్రదేశ్​ తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.

కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముప్పు కారణంగా శారీరకంగా ప్రజలంతా చాలా ఇబ్బందులు పడ్డారని.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా అంతా కోలుకుంటున్నారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చిన కారణంగానే.. కరోనా కట్టడి చేసుకోగలిగామని అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.