రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తూర్పు ఉత్తరప్రదేశ్ మధ్య భాగం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 5.8 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ప్రధానంగా నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: మేయర్లు, నగరపాలికల పరిధి ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష