ETV Bharat / state

వందేళ్లకు చేరువలో.. పతకాల సెంచరీ

ప్రస్తుతం సగటు నగర యువతకు చిన్న వయసు నుంచే ఊబకాయంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మధ్యవయసుకు వచ్చే సరికి ఏదో ఒక అనారోగ్య కారణాలతో నిత్యం గోళీలు మింగాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకు భిన్నంగా వందేళ్లకు చేరువలో ఉన్న వృద్ధులు దుండిగల్‌ ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో (400 మీటర్ల పరుగు పందెం) ఉత్సాహంగా పాల్గొన్నారు. ఔరా అనిపించారు. ఆదర్శంగా నిలిచారు.

oldage champions
రన్నింగ్‌లో వృద్ధుల ఘనత
author img

By

Published : Feb 14, 2021, 1:34 PM IST

30 దాటగానే సాహసాలు చేయడం మా వల్ల కాదు అని చేతులెత్తేస్తున్న యువతకు వీరి విజయాలు ఆదర్శం. ఒకరు సెంచరీకి దగ్గర్లో ఉంటే.. మరొకరు కొంచెం దూరంలో ఉన్నారు. వయసు మీద పడినా ఇబ్బంది లేదు.. ఇంకా విజయాలు సాధిస్తామంటున్నారు ఈ వృద్ధులు. వారు సాధించిన పతకాల సంఖ్య వారి వయసును మించిపోయింది. వాళ్ల గురించి మీరూ తెలుసుకోండి..

వయసు: 98... పతకాలు: వందకు మించి..

oldage champions
శతకం దాటిన పతకాలు

..ఇదీ ఈ వృద్ధుడి ఘనత. ఈయన పేరు రామచంద్రారెడ్డి. తిరుపతికి చెందిన వారు. వ్యవసాయదారుడు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసముంటున్నారు. 2003 తన ఎనభయ్యోఏట (2003) మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. గత 18 ఏళ్లలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి 100, 200, 400 మీటర్ల రన్నింగ్‌ పోటీల్లో పాల్గొని వందకు పైగా పతకాలు గెలుచుకొన్నారు. 5 అంతర్జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు పొందారు. ఇప్పటికీ దేశంలోఎక్కడ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు జరిగినా పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.

వయసు: 85, పతకాలు: 102...

oldage champions
రన్నింగ్‌లో బామ్మ జోరు.. పతకాల హోరు

హైదరాబాద్‌ బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన ఈ వృద్ధురాలి పేరు శారదాదేవి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఇప్పటికీ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 100, 200 మీటర్ల పరుగు, 3 కి.మీ. నడక పోటీల్లో సత్తా చాటుతున్నారు. భూటాన్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో రెండు బంగారు పతకాలు సాధించారు. 40 ఏళ్లుగా క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడలు ఉన్నా లేకున్నా నిత్యం వ్యాయామం, నడక తప్పనిసరిగా సాధన చేస్తానంటున్నారు ఈమె. గతేడాది మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో శారదాదేవితో పాటు ఆమె కుమార్తె, మనవరాలు కూడా విజయం సాధించడం గమనార్హం.

ఇదీ చదవండి: చలి తీవ్రత తగ్గుతోంది.. గాలిలో తేమ పెరుగుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.