Chaitanyapuri Car Accident Today : కర్ణాటకకు చెందిన కాళిదాసు, సీమా బతుకు దెరువు కోసం 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. కాళిదాసు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితం సీమా అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న చైతీశ్‌ను మేనత్త చేరదీసింది. వారి ఇంట్లోనే ఉండి చైతీశ్ చదువుకుంటున్నాడు. ప్రస్తుతం స్థానికంగా ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో స్థానికులు సైతం అతని బాగోగులు చూసుకునేవారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - తెలంగాణ అయ్యప్ప భక్తులు దుర్మరణం
గత రాత్రి భోజనం అనంతరం రాజీవ్ గాంధీనగర్ కమాన్ వద్ద రోడ్డు ప్రక్కనే ఉన్న అరుగుపై కూర్చున్నాడు. రాత్రి 12 గంటల సమయంలో అతి వేగంగా వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కారు అతడిని బలంగా ఢీకొంది. దీంతో చైతీశ్ పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి ఎగిరిపడ్డాడు. దుకాణానికి ఉన్న రేకులు అతడిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీశారు. తీవ్ర గాయాల పాలైన ఏడుగురు యువకులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అత్యాచారం కేసులో యూట్యూబ్ స్టార్ చంద్రశేఖర్ అరెస్టు
రాళ్ల మధ్యలో పడి తీవ్ర గాయాల పాలైన చైతీశ్ ఆర్తనాదాలు మాత్రం ఎవరికీ వినిపించలేదు. రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వారిని మాత్రమే పోలీసులు రక్షించారు. చైతీశ్‌ను ఎవరూ గమనించలేదు. ఉదయం స్థానికులు ఘటనా స్థలానికి కొద్దిదూరంలో రాళ్ల మధ్యలో పడి ఉన్న చైతీశ్‌ను గుర్తించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ అస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బేకరీలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ - ఒకరు మృతి - సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఘటనకు కారణమైన కారు చౌటుప్పల్ తహసీల్దార్ హరికృష్ణ భార్య పేరుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత రాత్రి అతని కుమారుడు సాయికార్తీక్ ఆరుగురు స్నేహితులతో కలిసి మీర్‌పేటకు వెళ్లాడు. అక్కడ ఓ బర్త్ డే పార్టీలో పాల్గొన్న వారంతా రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్‌వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చిన వీరి కారు రోడ్డు పక్కన కూర్చుని ఉన్న చైతీశ్‌ను ఢీకొట్టింది. ప్రమాద దాటికి కారులోని వారంతా చెల్లాచెదురయ్యారు. తీవ్ర గాయాలపాలైన సాయి కార్తీక్, శరత్ చంద్రలు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందతున్నారు. క్షతగాత్రుల్లో నవీన్ రెడ్డి, సురేశ్‌ల పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు గాంధీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతుడి బంధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌లో నరహంతకుడి అరెస్ట్ - విచారణలో విస్తుపోయే నిజాలు