హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భగవత్ సప్తాహం కార్యక్రమం జరిగింది. భగవత్ సప్తాహంలోని పలు అంశాలను భక్తులకు చాగంటి కోటేశ్వరరావు వివరించారు. పోతన భాగవతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించడం, తెలుగు సాహిత్యంపై పోతనకున్న సాహితీ పటిమను తెలియజేస్తుందని చాగంటి అన్నారు.
పోతన తెలుగు భాషకు ఎంతో సేవ చేశారని ఆయన పేర్కొన్నారు. మనిషి జనన మరణాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయన్నారు. జీవితకాలంలో భాగవతం ఒక్కసారైనా చదవమని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మాజీ ఎంపీ కవిత, కేటీఆర్ సతీమణి శోభ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు... స్లో ఫుడ్ సెంటర్