ETV Bharat / state

అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పనిచేస్తాం, అయినా మా పోరాటం ఆగదన్న చాడ - CPI Supports TRS news

CPI Supports TRS in Munugode By poll మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అధికారికంగా ప్రకటించారు. మునుగోడుతో పాటు అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. తెరాసకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలపై తమ పోరాటం ఆగదని చాడ స్పష్టం చేశారు.

అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పనిచేస్తాం, ప్రజల సమస్యలపై పోరాడతామన్న చాడ

author img

By

Published : Aug 20, 2022, 4:13 PM IST

Updated : Aug 20, 2022, 5:12 PM IST

అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పనిచేస్తాం, అయినా మా పోరాటం ఆగదన్న చాడ

CPI Supports TRS in Munugode By poll: స్వార్థం కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడులో ఐదుసార్లు సొంతంగా గెలిచామని, రెండుసార్లు ఇతర పార్టీల మద్దతుతో గెలిచామని చాడ గుర్తు చేశారు. భాజపాను ఓడించే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. తెరాసకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని చాడ మండిపడ్డారు. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. రక్షించేందుకే కమ్యూనిస్టులు అప్రమత్తమయ్యారని తెలిపారు. ప్రగతిశీల శక్తుల ముందు నిలవలేమని రేపు అమిత్ షాకు అర్థమవుతుందన్నారు. ఈ క్రమంలోనే మునుగోడులో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా లేదన్న చాడ.. అందుకోసమే తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మునుగోడే కాదు అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేస్తామన్నారు.

మునుగోడులో ఐదు సార్లు సొంతంగా గెలిచాం. రెండు సార్లు ఇతర పార్టీల మద్దతుతో గెలిచాం. భాజపాను ఓడించే పార్టీకే మా మద్దతు ఉంటుంది. భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. మునుగోడులో తెరాసకు మద్దతు ఇస్తున్నాం. మునుగోడులో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా లేదు. అందుకే తెరాసకు మద్దతు ఇస్తున్నాం. తెరాసకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలపై మా పోరాటం ఆగదు. - చాడ వెంకట్​రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే పటిష్ఠ ప్రణాళికలతో తెరాస, కాంగ్రెస్, భాజపాలు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. ఒకరిపై మరొకరు విమర్శల జల్లు కురిపిస్తూ మునుగోడు ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మునుగోడు పీఠాన్ని ఎలాగైనా అధిష్ఠించాలన్న పట్టుదలతో ఉన్న అధికార తెరాస ఓ అడుగు ముందుకేసింది. ఈ ఉపఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని సీపీఐని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన సీపీఐ మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు మద్దతివ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి.. 2 గంటల పాటు చర్చించారు. ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వాలని నేతలను కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాసకు మద్దతు ఉంటుందని సీపీఐ చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి..:

మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు సీపీఐ మద్దతు

సీఎం కాన్వాయ్ రాకతో, హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్

ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవం, శిశువు మృతి, ఆ నిర్లక్ష్యంతోనే

Last Updated : Aug 20, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.