హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని కేంద్ర బృందం సందర్శించింది. అనంతరం కోకాపేట్‌లోని అక్షయపాత్ర సెంట్రల్ కిచెన్‌ను తనిఖీ చేశారు. రాష్ట్రంలో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తయారై జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా అన్నార్థులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మరింత మంది ఆకలిని ఇవి తీర్చేలా ఈ క్యాంటిన్ల సంఖ్యను పెంచారు.
హరేకృష్ణ ట్రస్టు సభ్యులు కోకాపేటలోని పూర్తి మిషనరీ ఆధారిత కిచెన్ ద్వారా ఆహార తయారీ ఏవిధంగా జరుగుతుందో కేంద్ర బృందానికి వివరించారు. కూరగాయల నాణ్యత, ఆహార మెనూ, సానిటరీ చర్యలు, తయారీలో భాగంగా తీసుకుంటోన్న జాగ్రత్తలను కేంద్ర సభ్యులు పరిశీలించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు