సీఏఏతో దేశంలోని ఏ ఒక్కరికైనా అన్యాయం, ఇబ్బంది, నష్టం కలుగుతుందా అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకించడం ఏ మాత్రం న్యాయం కాదని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అక్రమ చొరబాటుదారులకు పౌరసత్వం ఇవ్వబోమని శారణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పాకిస్థాన్ పౌరుల కోసం సీఏఏను వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు.
నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సంత్ రవిదాస్ 621జయంతి ఉత్సవాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శరణార్థులు వేరు చొరబాటుదారులు వేరని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అణచివేతకు గురైనవారు దేశానికి శరణార్థులుగా వచ్చారని... వారి కోసమే సీఏఏ తీసుకువచ్చినట్లు కేంద్ర సహాయ మంత్రి వివరించారు. రవిదాస్ గొప్ప గురువుగా లక్ష్మణ్ కొనియాడారు. దళిత సామాజిక వర్గంలో జన్మించి ఉన్నతస్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఎంఐఎం మెప్పుకోసం జీహెచ్‌ఎంసీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని లక్ష్మణ్ విమర్శించారు.
ఇవీ చూడండి: అత్యాచార ఉచ్చుల్లో అకృత్యాలెన్నెన్నో!