ETV Bharat / state

Kishanreddy: దోబీఘాట్​లో కమిటీ హాల్​ను ప్రారంభించిన కేంద్రమంత్రి

హైదరాబాద్ తక్కిజైల్​ దోబీఘాట్​లోని కమిటీ హాల్​ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అన్ని కులాలను అభివృద్ధి చేస్తూ... వారి వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని ఆయన అన్నారు.

central minister kishan reddy inaugurates Committee Hall in Dobighat at kachiguda
దోబీఘాట్లో కమిటీ హాల్ను ప్రారంభించిన కేంద్రమంత్రి
author img

By

Published : Jun 16, 2021, 2:20 PM IST

​ హైదరాబాద్ కాచిగూడలోని తక్కిజైల్ దోబీఘాట్​లో కమిటీ హాల్​ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, రజక అభివృద్ధి సంస్థ జాతీయ అధ్యక్షులు అంజయ్య, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్​ ఉన్నారు. రజకుల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంబర్​పేట ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసుకోవాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి అన్నారు. కరోనా అంతమయ్యాక రానున్న కాలంలో అందరి సహకారంతో పనులన్నీ పూర్తి చేసుకుంటామని తెలిపారు. అన్ని కులాలను అభివృద్ధి చేస్తూ వారి వృత్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని... పోలీసుల కోసం కాకుండా మనకోసమే మాస్కును ధరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.