ETV Bharat / state

కేసీఆర్ జాతీయ పార్టీ పెడతామనటం ఈ దశాబ్దంలో పెద్ద జోక్: కిషన్‌రెడ్డి

kishan reddy fires on kcr: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీ పెడతామనటం ఈ దశాబ్దంలో పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని అభిప్రాయపడ్డారు.

central minister kishan reddy fires on cm kcr
కిషన్‌రెడ్డి
author img

By

Published : Sep 12, 2022, 4:01 PM IST

Updated : Sep 12, 2022, 4:41 PM IST

kishan reddy fires on kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడతామనటం ఈ దశాబ్దంలో పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఉద్దరించమని రెండుసార్లు గెలిపిస్తే ఏం చేశారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్​లోని రామ్​లీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

''తెలంగాణను ఉద్దరించమని రెండు సార్లు గెలిపిస్తే... పాలన చేతగాక జాతీయ పార్టీ పెడతానంటున్నారు. అసలు 17 సీట్లలో కేసీఆర్‌కు వచ్చింది 9 సీట్లే... వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క సీటు కూడా రాదు. అన్ని పార్టీలు ఏకమైనా... నరేంద్ర మోదీని ఏం చేయలేరు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చారు. మోటర్లకు మీటర్లు పెట్టే అవసరం లేదు.. కానీ కేసీఆర్ అవినీతికి మాత్రం మీటర్లు పెడతాం.'' -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఆకాంక్షించారు. కేసీఆర్ ఇంకా ఉంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.40 వేల కోట్లు నష్టాలు వచ్చాయని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు.

''కేసీఆర్‌ను మించిన అరచకవాది, నియంతృత్వవాది ఇంకొకరు లేరు. వచ్చే ఎన్నికల్లో భాజపా వందశాతం సీట్లు గెలుస్తుంది. అందుకే కేసీఆర్ విష, అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రగతిభవన్ నుంచి ప్రజలు తరిమికొట్టే పరిస్థితి రాబోతుంది. 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారు.'' -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఇవీ చూడండి:

Last Updated : Sep 12, 2022, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.