రెండు పడకల ఇళ్లు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే భాజపాకు అంత లాభం చేకూరుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు పడకల ఇళ్ల అంశమే కీలకం కానుందని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీపై పార్టీలో చర్చ జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసే విషయంలోనూ స్పష్టత కొరవడిందన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలివ్వాలని వ్యాపారవేత్తలకు సీఎం ఫోన్ చేసి అడుగుతున్నారని తెలిపారు.
విరాళాలు ఇవ్వాలని సినీనటులను మంత్రి తలసాని అడిగినట్లు కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మంత్రి అడిగినందునే నాయకులు సైతం విరాళాలివ్వాలని పవన్ కల్యాణ్ అన్నారని వెల్లడించారు. త్వరలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి విపత్తు నిధులొస్తాయని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నాం: కేటీఆర్