ETV Bharat / state

పారదర్శకత పెంపే లక్ష్యంగా... కేంద్రం కొత్త విధానం - ఆదాయపు పన్ను శాఖలో కొత్త విధానం

పారదర్శకత పెంపే ప్రధాన లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖలో పరోక్ష పన్నుల అసెస్‌మెంట్‌ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటికే దేశంలోని ఆరు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ పరోక్ష పన్నుల అసెస్‌మెంట్‌ విధానం వచ్చే ఆర్థిక ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది.

పారదర్శకత పెంపే లక్ష్యంగా... కేంద్రం కొత్త విధానం

author img

By

Published : Aug 5, 2020, 2:05 PM IST

ఆదాయపు పన్ను శాఖ పనితీరులో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా పారదర్శకత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పన్నుల అసెస్‌మెంట్ విధానాన్ని మరింత సరళతరం చేయనుంది. పన్ను చెల్లింపుదారులతో నేరుగా ఆదాయపు పన్ను అధికారులు కలువకుండానే ఇ-అసెస్‌మెంట్ కేసులను పరిష్కరిస్తారు. ఇందువల్ల పన్నుల మదింపులో పారదర్శకత పెరగడం, సమయం వృథా కాకుండా వేగంగా ప్రక్రియ పూర్తవడంతో పాటు అవినీతికి అస్కారం లేకుండా ప్రభుత్వానికి రావల్సిన పన్నులు కూడా పెరుగుతాయని అదాయపు పన్ను శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌- సీబీడీటీ ఇ-అసెస్‌మెంట్ పథకానికి చెందిన నోటిఫికేషన్‌ను 2019 సెప్టెంబరు 12న జారీ చేసింది. ప్రధానంగా ఇ- అసెస్‌మెంట్ విధానం ప్రకారం పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి రావాల్సిన పని లేదు. అసెస్‌మెంట్ ప్రక్రియ అంతా కూడా... ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది. ఆదాయపు పన్ను శాఖకు దేశ వ్యాప్తంగా మొత్తం 17 జోన్లు ఉండగా అందులో ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌తోపాటు ముంబయి, కోలకొత్తా, బెంగళూరు, చెన్నై, పూణాల్లో మొత్తం ఆరు ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నారు.

సాంకేతికతను ఉపయోగించుకుని...

అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థంగా పని చేయాలన్న దిశలో కేంద్రం ముందుకెళుతోంది. అందులో భాగంగానే సీబీడీటీ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా వ్యాక్తిగత ఆదాయపు రిటర్న్‌లు, వ్యాపార సంస్థల ఆదాయపు రిటర్న్‌లు దాఖలు చేస్తారు. కోట్ల కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని వీటిని నేషనల్‌ ఇ- అసెస్‌మెంట్ కేంద్రం కేసులను ఎంపిక చేస్తోంది. వాటిని ఆటోమెటిక్‌ విధానాన్ని అనుసరించి అసెస్‌మెంట్ కేసులను దేశంలోని ఆయా జోనల్‌ కార్యాలయాలకు పంపిస్తారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన పన్ను చెల్లింపుదారుడి కేసును... దేశంలోని ఏ జోన్‌కైనా పంపొచ్చు. అక్కడ ప్రిన్సిపల్‌ ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్ల స్థాయిలో అధికారులు పరిశీలిస్తారు. ఇలా చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులతో అధికారులకు ఏలాంటి సంబంధం ఉండదు.

ఇ- విధానం..

ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇతర కార్యకలాపాలు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే ఉంటాయి. అనుమానం ఉన్న ప్రతి విషయాన్ని ఇ- విధానం ద్వారానే తెప్పించుకుని పరిశీలన చేస్తారు. అవసరమైతే క్యాష్‌ బుక్‌, లెడ్జర్‌, లాభనష్టాల పుస్తకం, బ్యాలెన్స్‌ షీట్‌ తదితర వివరాలను కూడా కోరవచ్చు. అడిగిన సమాచారం ఇవ్వకపోయినా...ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా అందుబాటులో ఉన్న సమాచారంతో అధికారులు డిమాండ్‌ రైజ్‌ చేస్తారు. వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటే ఈ విధానంతో పన్ను చెల్లింపుదారులపై అనవసరంగా భారీ జరిమానా విధింపులు లాంటివి ఉండవని, బహుళ ప్రయోజనాలు ఉంటాయని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంటోంది.

సమీక్షలో మరిన్ని..

దేశ వ్యాప్తంగా పరోక్ష అసెస్‌ మెంట్ పథకం కింద 58,319 కేసులు పరిశీలన చేస్తున్నారు. అందులో 8,701 కేసులకు ఎలాంటి మార్పులు చేయకుండానే ఖరారు చేశారు. 296 కేసుల విషయంలో మాత్రం అదనపు చేర్పులు ప్రతిపాదించగా అవి సమీక్షలో ఉన్నాయి. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఇ- అసెస్‌మెంట్ విధానం అమలులోకి వచ్చినట్లయితే పన్నుల రాబడులు పెరగడంతోపాటు పారదర్శకత పెరుగుతుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.