ETV Bharat / state

ECO ZONE: ఎకో సెన్సిటివ్ జోన్‌గా సాగర్-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ సరిహద్దు ప్రాంతాలు - ap news

ఎకో సెన్సిటివ్ జోన్‌గా సాగర్-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ సరిహద్దు ప్రాంతాలను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది.

eco zone
eco zone
author img

By

Published : Aug 17, 2021, 9:00 PM IST

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ సరిహద్దు వెలుపల విస్తరించిన రిజర్వు ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్‌గా కేంద్ర అటవీ శాఖ గుర్తించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. టైగర్‌ రిజర్వ్‌ సరిహద్దుల నుంచి మొదలై 2,149 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని కొత్తగా ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించినట్టు ఏపీ పీసీసీఎఫ్ ప్రతీప్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. కొత్తగా మరో 2,149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా కేంద్రం గుర్తించినట్టు వివరించారు.

టైగర్‌ రిజర్వ్‌ సరిహద్దుల నుంచి మొదలై 26 కిలోమీటర్ల దూరం వరకూ ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం 47వ ఎకో సెన్సిటివ్ జోన్ నిపుణుల కమిటీ సమావేశంలో దీన్ని ఆమోదించినట్టుగా ప్రతీప్ కుమార్ తెలిపారు. ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించిన నేపథ్యంలో పులులతో పాటు ఇతర వన్యప్రాణులకూ స్వేచ్ఛ, మనుగడకు మరింత సంరక్షణ చేకూరుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి: Global Geospatial Information Conference: హైదరాబాద్ వేదికగా గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సదస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.