ETV Bharat / state

Zonal line clear: అమల్లోకి కొత్త జోనల్‌ వ్యవస్థ... మార్పులు, చేర్పులకు సర్కారు ఉత్తర్వులు

author img

By

Published : Jun 30, 2021, 7:01 PM IST

Updated : Jul 1, 2021, 3:16 AM IST

జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం

18:58 June 30

రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థలో మార్పులకు ఈ ఏడాది ఏప్రిల్‌ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దాన్ని కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి పంపించగా రాష్ట్రంలో అమలుకు వీలుగా తాజాగా జీవో 128 ఇచ్చింది. తద్వారా జోనల్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లే. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ కొత్త జోనల్‌ విధానం వర్తింపజేయనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం జోనల్‌ వ్యవస్థలో మార్పులుచేసింది. గతంలో ఉన్న రెండు జోన్లను ఏడు చేసింది. కొత్తగా రెండు బహుళ జోన్లను ఏర్పాటు చేసింది. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళ జోన్‌లో, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళ జోన్‌లో చేర్చింది. 

స్థానికుల ప్రయోజనాల కోసం..  

  ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళ జోన్‌, రాష్ట్ర స్థాయి కేడర్లుగా మార్చి మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టాలని, రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులుగా పరిగణిస్తారు. విద్య, ఉద్యోగాలకు జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌ పరిధిలో 95 శాతం స్థానికత, 5 శాతం ఓపెన్‌ కేటగిరీగా ప్రకటించింది. రాష్ట్ర కేడర్‌ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అవుతున్నందున వాటికి రిజర్వేషన్లతో సంబంధం ఉండదని పేర్కొంది. ములుగు, నారాయణపేట జిల్లాలను చేర్చడంతో పాటు ప్రజల విజ్ఞప్తి మేరకు వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. అందుకు ఏప్రిల్‌లో కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు జోన్లు, 10 జిల్లాల విధానం కిందనే నియామకాలు చేపడుతున్నారు. తాజాగా కొత్త జోనల్‌ విధానం పూర్తిగా ఆమోదం పొందడంతో.. ఇకపై 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు బహుళ జోన్ల ప్రాతిపదికన కొత్త ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. జిల్లాలు పెరిగినందున అప్పట్లో ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తైనందున వెంటనే ప్రతీ జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేయాలి.  ఇప్పటికే రాష్ట్ర సర్కారు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించింది. ఇకపై వాటిపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. 

కాళేశ్వరం జోన్ 
భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు జిల్లాలు 

బాసర జోన్ 

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు 

రాజన్న జోన్‌‌

కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు 

భద్రాద్రి జోన్​

వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు  

యాదాద్రి జోన్‌

సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు 

చార్మినార్‌ జోన్‌

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు

జోగులాంబ జోన్‌

మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, నారాయణపేట జిల్లాలు 

మల్టీ జోన్-1

కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు

మల్టీ జోన్-2

యాదాద్రి, చార్మినార్​, జోగులాంబ జోన్లు

ఇదీ చదవండి: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన జిల్లా అటవీశాఖ అధికారి

Last Updated : Jul 1, 2021, 3:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.