గత ఐదేళ్లలో ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు కట్టారని.. ఎన్ని పంపిణీ చేశారని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇళ్లు ఇవ్వకపోతే తెరాస పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. ఎవరింటికైనా తెరాస నేతలు వస్తే రెండు పడక గదుల ఇళ్ల పంపిణీపై నిలదీయాలని ప్రజలకు సూచించారు. వరద సాయం పదివేల రూపాయిలు ఎంతమందికి ఇచ్చారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. పేద ప్రజలకు అందాల్సిన డబ్బును అధికార పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. భాజపా అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కిషన్రెడ్డి అభ్యర్థించారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి తప్ప.. పనులు మాత్రం జరగవు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది. ప్రతీ ఇంటికి వంట గ్యాస్ రాయితీని అందిస్తోంది. రూపాయికే కిలోబియ్యం పథకానికి కేజీకి రూ.30 కేంద్రం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రూపాయిలు మాత్రమే ఇస్తోంది. సచివాలయం లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే.
- కిషన్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ఇవీచూడండి: 'గ్రేటర్ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దు'