ETV Bharat / state

సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ సతీష్ ప్రభుకు ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ ప్రభు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌తో ప్రభుత్వం ఆయనని సత్కరించింది. సీబీఐలో పనిచేస్తూ పలు సంచలన కేసులను ఆయన ఛేదించారు. ముఖ్యంగా నేర పరిశోధనల్లో ప్రభు సమర్థవంతంగా పనిచేశారు.

author img

By

Published : Dec 10, 2020, 1:27 PM IST

Updated : Dec 10, 2020, 5:39 PM IST

cbi inspector sathish prabhu got president police medal award
సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ సతీష్ ప్రభుకు ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌..

రాష్ట్రానికి చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ బి.సతీష్ ప్రభు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యూ దిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ ఈ అవార్డును ప్రభుకు బహుకరించారు.

సతీష్ ప్రభు సీబీఐలోనూ, ఆర్పీఎఫ్‌లోనూ అనేక సంచలన కేసులను పరిశోధించి... నిందితులకు శిక్ష పడేలా చేశారు. సంచలనం సృష్టించిన అబూ సలేమ్ -మోనికా బేడి కేసును ఈయనే ఛేదించారు. ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ భాగస్వాములపైన అవినీతి కేసులను సాక్ష్యాధారాలతో నిరూపించారు.

గౌతమి ఎక్స్‌ప్రెస్ కుట్ర కేసుతో పాటు అంతర్రాష్ట్ర గంజాయి కేసుల్లో కూడా సమర్థవంతంగా పని చేసి సతీష్‌ పలు అవార్డులు అందుకున్నారు. నేర పరిశోధనల్లో చూపిన సమర్థతకు 2012లో ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్‌ని ఆయన అందుకున్నారు.

ఇదీ చదవండి: డ్రగ్స్​ కేసు: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం

Last Updated : Dec 10, 2020, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.